Thu Dec 19 2024 17:42:40 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ : వల్లభనేని వంశీ
ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా..
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు హైలెట్ అయింది. లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తామనడంతో.. ఇప్పుడు రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. పాదయాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, టీడీపీలోకి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. దాంతో కొందరు ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకోగా.. మరికొందరు నెగిటివ్ గా తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ను వాళ్లు పార్టీలోకి ఆహ్వానించడమేంటంటూ.. చంద్రబాబు, లోకేశ్ లపై వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని లోకేశ్ టీడీపీ లోకి ఆహ్వానిస్తామనడం పెద్ద జోక్ అన్నారు. టీడీపీ పెట్టింది లోకేశ్ తాత ఖర్జూర నాయుడు కాదు. టీడీపీని స్థాపించింది పెద్ద ఎన్టీఆర్. దానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ల తాత పెట్టిన పార్టీలోకి ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరి దయ అవసరం లేదు. వాళ్ల తాత పెట్టిన పార్టీ ఆయన చూసుకోగలడని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.
Next Story