Sun Jan 12 2025 13:06:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్ఎఫ్సి ఏర్పాటుపై టీడీపీ హైకోర్టుకు
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలకు నిధులు విషయంలో సిఫార్సు చేసే రాజ్యంగ బద్ధ సంస్థను ప్రభుత్వం పట్టించుకోవడడం లేదని జీవీరెడ్డి పిటీషన్ లో పేర్కొన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనే...
2020లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం ముగిసినా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. కమిషన్ ను నియమించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుందన్నారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జీవీ రెడ్డి హైకోర్టును కోరారు.
Next Story