Mon Dec 23 2024 08:38:58 GMT+0000 (Coordinated Universal Time)
బీసీలంటే వైఎస్ ఫ్యామిలీకి కక్ష
బీసీ లంటే వైఎస్ కుటుంబానికి తొలి నుంచి కక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
బీసీ లంటే వైఎస్ కుటుంబానికి తొలి నుంచి కక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసిందేమీ లేదన్నారు. నాలుగేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పగలరా? అని అచ్చెన్నాయుడు జగన్ ను ప్రశ్నించారు. బీసీలపై చూపిస్తున్న కపట ప్రేమను ఎవరూ నమ్మే స్థితిలో లేరని, టీడీపీకి తొలి నుంచి బీసీలు అండగా ఉంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
బీసీ సంక్షేమం కోసం...
బీసీ సంక్షేమం కోసం గత ప్రభుత్వం పెట్టిన పథకాలన్నింటినీ జగన్ రద్దు చేశారని ఆయన విమర్శించారు. అది కక్ష సాధింపు కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో తమ టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో లెక్కలతో సహా తమ వద్ద ఉన్నాయని, తమ ప్రభుత్వ హయాంలో పెట్టిన జయహో బీసీ పేరిట నిర్వహించడం తప్ప, కనీసం పేరు పెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో వైసీీపీ ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు.
Next Story