Wed Mar 26 2025 06:41:05 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాను అబద్దాలు చెప్పడం లేదని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాను అబద్దాలు చెప్పడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు తమకే ఆపర్లు ఇస్తున్నారని తెలిపారు. ఒకరికి సీటిస్తామనే హామీ ఇస్తే, నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని ఆయన అన్నారు.
40 మంది టచ్లోనే...
వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తమతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు మేమేందుకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేయడం పిచ్చితనమే అవుతుందని తెలిపారు. తాము టీడీపీలోకి వెళ్లమని, వైసీపీతోనే తమ జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే టీడీపీలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నారు.
Next Story