Mon Dec 23 2024 04:34:15 GMT+0000 (Coordinated Universal Time)
బీసీలకు టీడీపీ అధకారంలోకి రాగానే
బీసీలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
బీసీలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధకారంలోకి అధికారంలోకి రాగానే ‘జన్మభూమి పిలుస్తోంది కదిలిరా’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. ఎన్నారైలను ఏపీకి రప్పించి గ్రామాలను, పేదలను దత్తత తీసుకునేలా చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లలో కోత పెట్టి బీసీలను జగన్ సర్కార్ అణగదొక్కేసిందని అచ్చెన్న విమర్శించారు.
చట్ట సభలకు...
బీసీ కులాలను చట్ట సభలకు పంపుతామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. బీసీలలో 12 మంది మంత్రులు ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. తమకు ఇది కావాలని ఏ మంత్రికి అడిగే ధైర్యం లేదన్న అచ్చెన్నాయుడు బలహీనవర్గాలకు సబ్‌ప్లాన్ తెచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే 4-పి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రభుత్వం, ప్రవేట్, పబ్లిక్, పార్టనర్ కలిపి అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు
- Tags
- achchennaidu
- bcs
Next Story