Wed Apr 09 2025 22:25:55 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ సర్కార్ పై అచ్చెన్న ఫైర్
టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై మండి పడ్డారు. పలాసలోని కాశిబుగ్గ మున్సిపాలిటీలో 27 వ వారడులో 2001లో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లను నిర్మించుకుని కొందరు జీవిస్తున్నారన్నారు. అయితే పలాసలో జరుగుతున్న భూ కబ్జాలపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నందుకు వారిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు.
అక్రమ కూల్చివేతలను...
అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుతో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పేదల తరుపున నిలబడటం ఆయన చేసిన నేరమా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దళిత డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీకి చేసిన వారికి రాచమర్యాదలు చేసిన పోలీసులు, పేదల పక్షాన పోరాడవారి పట్ల అమర్యాదగా వ్యవహరించడమేమిటని ఆయన నిలదీశారు.
Next Story