Mon Dec 23 2024 13:34:07 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసకర పాలనకు వెయ్యి రోజులు
జగన్ వెయ్యి రోజుల విధ్వంసకర పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
జగన్ వెయ్యి రోజుల విధ్వంసకర పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా టీడీపీ ఒక పుస్తకం విడుదల చేసింది. జగన్ పాలన విధ్వంసతోనే మొదలయిందని చెప్పారు. కూల్చివేతలతో ప్రారంభమైన జగన్ పాలన రాజధాని అమరావతిని నాశనం చేసే దిశగా సాగిందన్నారు. చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనని జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారన్నారు.
ఉపాధి లేక...
ఈ వెయ్యి రోజుల్లో ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోయాయని చెప్పారు. కొత్త పరిశ్రమలు ఏవీ రాకపోవడంతో యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందన్నారరు. జగన్ పాలనను అంతమొంచేందుకు సమయం ఆసన్నమయిందని చెప్పారు. ఎప్పుడు జగన్ ను దించేద్దామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story