Sat Dec 21 2024 09:50:04 GMT+0000 (Coordinated Universal Time)
ఇదేం అరాచకం.. దొంగఓట్లు వేస్తూ?
ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నిజాయితీగా గెలిచే దమ్ములేకనే అడ్డదారుల్లో వైసీపీ గెలించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లోనూ వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి వన్ సైడ్ పోలింగ్ చేయించుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని, ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారన్నారు.
వైసీపీ అరాచకం....
పోలీసులు ఉన్నది అధికార పక్షానికి కొమ్ముకాయడానికా? ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలనే ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందన్నారు. దొంగ ఓట్లు వేయిస్తూ గెలిచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ కార్కకర్తలపై రాళ్ల దాడులు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా వైసీపీకి సాధారణ ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Next Story