Sat Nov 23 2024 02:02:44 GMT+0000 (Coordinated Universal Time)
8 గంటలకో మానభంగం.. హత్య క్యాపిటల్‌గా ఏపీ.. జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
సీఎం వైఎస్ జగన్‌ని నేరుగా టార్గెట్ చేస్తూ ఒక నేరగాడికి పాలనా పగ్గాలు ఇస్తే రాష్ట్రం నేర నిలయం అవుతుందంటూ..
వైఎస్ జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది తెలుగుదేశం పార్టీ. జగన్ పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని.. ప్రతి 8 గంటలకో మానభంగం.. రోజుకి రెండు నుంచి మూడు హత్యలతో.. హత్య క్యాపిటల్ చేసేశారంటూ ఘాటు విమర్శలకు దిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఏపీలో నేరాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని.. హత్యలు, మానభంగాలు, దాడులు, రాజద్రోహం కేసులు, ఆహార కల్తీ.. ఇలా అన్నింటిలోనూ ఏపీ ముందుందంటూ తీవ్ర విమర్శలు చేసింది. దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించింది.
సీఎం వైఎస్ జగన్‌ని నేరుగా టార్గెట్ చేస్తూ ఒక నేరగాడికి పాలనా పగ్గాలు ఇస్తే రాష్ట్రం నేర నిలయం అవుతుందంటూ ఘాటు విమర్శలు చేసింది. పోలీసులు మాత్రం జగన్ రెడ్డి పగను చల్లార్చే పనిలో బిజీగా ఉన్నారని.. తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ ఉద్యోగులపై నిఘాకి సమయం వెచ్చిస్తూ నేరస్తులకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారంటూ ఎద్దేవా చేసింది. అలాగే పోలీసులే నేరాలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లోనూ ఏపీ 5వ స్థానంలో ఉందని.. కస్టోడియల్ డెత్‌లలో మూడో ప్లేస్‌లో ఉన్నామని విమర్శించింది. రాజద్రోహం కేసుల నమోదులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపింది. నేరాల నియంత్రణలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ సోషల్ మీడియాలో భారీ ప్రచారం చేపట్టింది.
Next Story