Thu Dec 19 2024 18:40:32 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ఆధ్వర్యంలో నిరసన
టీడీపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండో రోజు ఆందోళన చేపట్టింది. జంగారెడ్డిగూడెం వరస మరణాలపై ఈ నిరసన చేపట్టింది
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండో రోజు ఆందోళన చేపట్టింది. జంగారెడ్డిగూడెం వరస మరణాలపై ఈ నిరసన చేపట్టింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజు నిరసన కార్యక్రమాన్ని చేప్టటారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలన్నీ కల్తీ మద్యానికి సంబంధించినవేనని, ఇవి సర్కార్ హత్యలని టీడీపీ ఆరోపిస్తుంది.
ప్రభుత్వ హత్యేలనంటూ...
ప్రభుత్వం ఇస్తున్న నకిలీ బ్రాండ్ల మద్యంపై విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ఊసే మర్చిపోయి, ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆరోపిస్తుంది. సచివాలయం నుంచి అసెంబ్లీ వరకూ టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
Next Story