Mon Dec 23 2024 09:56:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పెద్దిరెడ్డికి ఫస్ట్ షాక్.. మామూలుగా లేదుగా
పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ భారీ షాక్ ఇవ్వనుంది.
పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ భారీ షాక్ ఇవ్వనుంది. పుంగనూరు మున్సిపాలిటీని తమ పరం చేసుకోనుంది. మున్సిపల్ ఛైర్మన్ భాషాతో పాటు ఇరవై మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ నేత చల్లాబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
పుంగనూరు మున్సిపాలిటీ ...
పుంగనూరు మున్సిపాలిటీ ప్రస్తుతం వైసీపీ చేతుల్లో ఉంది. అయితే వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మున్సిపల్ ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కూడా అధికార టీడీపీ వైపు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం చల్లాబాబు సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కారణంగా పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ చేజిక్కించుకోనుంది.
Next Story