Mon Jan 13 2025 11:44:15 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో నిరసన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరిసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరిసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తుంది. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వారు రోడ్డుపైకి వచ్చి నినదిస్తున్నారు. మహిళలు, పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తుండటంతో పోలీసులకు బందోబస్తు నిర్వహించడం సవాలుగా మారింది.
బాబు అరెస్ట్‌కు నిరసనగా...
ఈరోజు మంగళగిరి పట్టణంలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కాగడాల ప్రదర్శన చేశారు. మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు నుంచి ప్రారంభమైన కాగడాల ర్యాలి మిద్దె సెంటర్, గాలి గోపురం, అంబేద్కర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ కాగడాల ప్రదర్శనలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నినాదాలు చేశారు.
Next Story