Mon Dec 23 2024 10:55:13 GMT+0000 (Coordinated Universal Time)
దర్శి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో
దర్శి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.
దర్శి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కేవలం దర్శిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన చోట్ల వైసీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. దర్శిలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
వన్ సైడ్ విక్టరీ....
దర్శిలో మొత్తం 20 వార్డులున్నాయి. అందులో ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయింది. 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 12 స్థానాలను దక్కించుకుంది. ఏడు వార్డుల్లోనే వైసీపీ విజయం సాధించింది. దీంతో దర్శి మున్సిపాలిటీ టీడీపీ పరమయింది.
Next Story