Mon Dec 23 2024 03:07:20 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రకు భద్రత కల్పించిండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు పోలీసుల అనుమతికోసం డీజీపీకి టీడీపీ లేఖ రాసింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు పోలీసుల అనుమతికోసం డీజీపీకి టీడీపీ లేఖ రాసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అనుమతి కోసం లేఖ రాశారు. ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని వర్ల రామయ్య డీజీపీకి రాసిన లేఖలో కోరారు. లేఖను డీజీపీతో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా లేఖను జత చేశారు.
లోకేష్ ప్రాణాలకు...
లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని, రాజకీయ వ్యతిరేక శక్తులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. లోకేష్ వ్యక్తిగత స్టాఫ్ నరేష పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటారని, లోకేష్ పాదయాత్ర సమయంలో రాత్రి బస సమయంలో తగిన భద్రత కల్పించాలని, దీనికి సంబంధించి అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో వర్ల రామయ్య కోరారు.
Next Story