Mon Dec 23 2024 05:48:00 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ కేఎస్ భరత్
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. ఏపీకి జగన్ సీఎం అయిన తర్వాత.. ఇండియన్ క్రికెట్ టీంకు ఏపీ నుంచి మొదటగా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇండియా క్రికెట్ టీమ్ కు చెందిన క్రికెటర్ కేఎస్ భరత్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీమ్ అంతా ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. ఏపీకి జగన్ సీఎం అయిన తర్వాత.. ఇండియన్ క్రికెట్ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ కీపర్ గా వ్యవహరించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ విషయాలను తాను సీఎంతో పంచుకున్నానని, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పారు.
దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయి, అలాగే స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బావుంది. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్గా చాలా బావుంది. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారు అని కేఎస్ భరత్ పేర్కొన్నారు. కేఎస్ భరత్తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు.
Next Story