Mon Dec 23 2024 15:54:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైఎస్ అవినాష్ రెడ్డి ఎదురుదెబ్బ
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది రెండు మధ్యంతర ఉత్తర్వుల పిటీషన్లపై ఆదేశాలు జారీ చేసింది
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి రెండు మధ్యంతర ఉత్తర్వుల పిటీషన్లపై ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించుకోవచ్చని పేర్కొంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తాము ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
జోక్యం చేసుకోలేమని...
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు విచారించారు. అయితే తనపై తదుపరి విచారణను నిలిపివేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను నిలుపదల చేయలేమని చెప్పింది. అలాగే అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని పేర్కొంది.
Next Story