Thu Dec 19 2024 13:13:36 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఫ్లెక్సీలు కట్టాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లెక్సీల్లో వైసీపీ నేతలు పేర్కొన్నారు. దీంతో నిన్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఉద్రిక్తతల మధ్య....
అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా కట్టిన ఫ్లెక్సీలను నిన్న అర్థరాత్రి మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలంటూ ఇంకా డిమాండ్ చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. పోలీసులు చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ భద్రతాదళాలు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story