Mon Dec 23 2024 12:50:54 GMT+0000 (Coordinated Universal Time)
అలా చేస్తేనే టిక్కెట్లు... చంద్రబాబు
ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతలను ఆదేశించారు.
ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతలను ఆదేశించారు. గెలుస్తామన్న నమ్మకాన్ని తనకు కల్పిస్తేనే టిక్కెట్ విషయంలో ఆలోచిస్తామని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నమ్మకం తనకు కలిగించకపోతే తాను ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని చంద్రబాబు కొంత కటువుగానే నేతలను హెచ్చరించారు.
సేవ్ ఉత్తరాంధ్ర...
అలాగే ఉత్తరాంధ్ర ప్రజల తరపున పార్టీ పోరాడాలని పిలుపునిచ్చారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రభుత్వ, ప్రజల ఆస్తుల పరిరక్షణకు పార్టీ నిలబడాలని ఆయన కోరారు. న్యాయస్థానాలు మూడు రాజధానులు సాధ్యం కానద ిచెప్పినా ప్రజలను మోసగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో నష్టపోని వర్గమంటూ ఏదీ లేదని, వారందరినీ కూడగట్టుకుని పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజలు, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే జగన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన కోరారు.
Next Story