Mon Dec 23 2024 09:06:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రెండో జాబితాను సిద్ధం చేస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో విడత జాబితాపై కసరత్తులు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో విడత జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని నియోజకవర్గాల నుంచి నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. రెండో జాబితా రేపు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆ నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో తాము పొత్తులో భాగంగా కోల్పోతున్న నియోజకవర్గాల నేతలను పిలిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే తాము సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
తన నివాసానికి పిలిచి...
నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో చర్చించారు. నేడు కూడా మరికొందరి నేతలను తన ఇంటికి పిలిపించుకుని చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలో గెలుపు పార్టీకి, టీడీపీ నేతలకు ఎంత అవసరమో కూడా చంద్రబాబు వారికి వివరిస్తున్నట్లు తెలిసింది. సర్వేలతోనే తాము అభ్యర్థులను మారుస్తామని, ఈసారి గెలుపు అవసరాన్ని గుర్తించి అభ్యర్థుల మార్పు తప్పదని, పార్టీ విజయానికి సహకరిస్తే తగిన గుర్తింపు ఉంటుందని కూడా చంద్రబాబు కొందరితో అంటున్నారని తెలిసింది.
Next Story