Sun Dec 22 2024 07:12:22 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య జరిగింది అందుకే.. బాబు సెన్సేషనల్ కామెంట్స్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి 2019 లో టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినందుకే వివేకాను హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. టిక్కెట్ ఇవ్వవద్దన్నందుకు వివేకాపై కక్ష కట్టారన్నారు. ముఖ్యమంత్రి జగన్ నేరాలు, ఘోరాలు చేస్తూ హత్యారాజకీయాలు చేస్తే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులను ఒక్కొక్కరినీ చంపేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తీర్మానం చేసి పంపండి...
సర్పంచ్ లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ లు అందరూ చెత్త పన్ను వేస్తే తాము వసూలు చేయబోమని పంచాయతీల్లో తీర్మానం చేసి పంపాలని చంద్రబాబు సర్పంచ్ లకు పిలుపునిచ్చారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వకుంటే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని చంద్రబాబు సర్పంచ్ లకు సూచించారు. బాబాయిని చంపి టీడీపీ విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు జగన్ పై ఫైర్ అయ్యారు
Next Story