Mon Dec 23 2024 11:27:40 GMT+0000 (Coordinated Universal Time)
ఓటేసిన చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీల్ ఛెయిర్లో...
అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వీల్ ఛైర్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు ఎమ్మెల్యేల ఓటింగ్ ముగిసిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ సమయం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలందరూ ఓటువేస్తే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
Next Story