Fri Dec 20 2024 18:27:38 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు గుర్తించారు. వెంటనే రాజమండ్రి జిల్లా ఆసుపత్రివైద్యులకు సమాచారం అందించారు. ప్రభుత్వ వైద్యులు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చర్మ సంబధిత వ్యాధితో...
ఎండవేడిమి, ఉక్కపోత కారణంగానే చంద్రబాబుకు చర్మ సంబంధితమైన ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపితే తప్ప ఏ విషయమూ తెలియరాలేదు. గత నెల రోజుల నుంచి చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో డీ హైడ్రేషన్కు కూడా గురయ్యారన్న వార్తల నేపథ్యంలో జైలు అధికారులు ఈసారి అప్రమత్తమై వైద్యలను రప్పించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
Next Story