Mon Mar 24 2025 05:02:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సర్కార్కు బాబు డెడ్లైన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. తడిసిన ధాన్యాన్ని 72 గంటల్లోపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రైతులు తమ ధాన్యాన్ని జగన్ నివాసానికి తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.
72 గంటలు...
గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రైతుల పోరాటానికి తాను అండగా ఉంటానని తెలిపారు. 72 గంటల్లో తడిచిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ఎవరూ పారబోయవద్దంటూ రైతులను చంద్రబాబు కోరారు.
Next Story