Mon Dec 23 2024 10:26:03 GMT+0000 (Coordinated Universal Time)
TDP Ra Kadali Ra : రా కదలిరా సభ వాయిదా.. రీజన్ ఇదే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సిన బహిరంగ సభను వాయిదా వేసుకున్నారు.
TDP Ra Kadali Ra:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సిన బహిరంగ సభను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో జరగాల్సిన సభ వాయిదా పడింది. అందుకు ప్రధాన కారణం ఎన్నికల కమిషన్ అధికారులను కలవాలని నిర్ణయించడమే. ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో రా కదలిరా సభను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే అదే రోజు విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. వారిని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు.
పవన్ కల్యాణ్ తో కలసి...
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీల అధ్యక్షులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని తెలిసి వెంకటగిరి సభను వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story