Mon Dec 23 2024 00:09:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు అమెరికాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశీపర్యటనకు వెళుతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశీపర్యటనకు వెళుతున్నారు. ఆయన అమెరికాకు బయలుదేరి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని అలసటతో ఉన్న చంద్రబాబు కాస్త ఉపశమనం కోసం అమెరికాకు పయనమవుతున్నారు. ఆయన ఎన్నికలు పూర్తయిన వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆరురోజుల తర్వాత...
ఇటీవల కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. షిర్డీలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే తాజాగా అమెరికాకు వెళ్లి తిరిగి ఆదివారం వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరీక్షలను కూడా చేయించుకుంటారని తెలిసింది. ఆరు రోజుల పాటు చంద్రబాబు విదేశీ పర్యటనలో గడపనున్నారు.
Next Story