Tue Mar 18 2025 03:15:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఢిల్లీ వెళ్లే ముందు చంద్రబాబు ఏం చేశారంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విమానంలో బయలుదేరి గన్నవరం నుంచి ఢిల్లీకి వెళతారు. అయితే ఈరోజు రాత్రికి ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం ఉండటంతో ఉదయం నుంచి పార్టీ నేతలతో ఆయన సమావేశమయి చర్చించారు. బీజేపీతో పొత్తు చర్చల సందర్భంగా సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలను చంద్రబాబు స్వయంగా సేకరించారు. బీజేపీ నేతలతో మాట్లాడే ముందు వారి ఒపీనియన్ తెలుసుకున్నారు.
టెలికాన్ఫరెన్స్ ద్వారా...
అందుబాటులో లేని కొందరు ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించినట్లు తెలిసింది. బీజేపీ నేతలకు ఇచ్చే స్థానాలతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపై కూడా నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈరోజు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయి రానున్న ఎన్నికల్లో పొత్తులపై చర్చించనుండటంతో ముందుగానే సీనియర్ నేతలతో సమావేశమై వారు ఏమనుకుంటున్నారన్నది ఆయన తెలుసుకున్నారు.
Next Story