Sun Apr 06 2025 09:25:00 GMT+0000 (Coordinated Universal Time)
వారం రోజులు బాబు బిజీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న వారం రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న వారం రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ వారం... వచ్చే వారం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఖరారయ్యాయి. రేపటి నుంచి ఈ నెల ఏడో తేదీ వరకూ ఆయన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల జోనల్ సదస్సుల్లో పాల్గొననున్నారు. ఐదో తేదీన విశాఖపట్నం, ఆరో తేదీన కడప, ఏడో తేదీన నెల్లూరుల్లో జరిగే సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారు.
నాలుగు జోనల్ సదస్సులో...
ఒక జోన్కు సంబంధించిన సదస్సులో 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారు. ఈ మూడు జిల్లాలు పూర్తయిన వెంటనే ఈ నెల 11వ తేదీన అమరావతిలో జరిగే ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనారిటీల కోసం ఇఫ్తార్ కార్యక్రమాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయం సమీపంలోని సీకే కల్యాణ మంటపంలో ఏర్పాటు చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 13న గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.
Next Story