Mon Dec 23 2024 07:37:43 GMT+0000 (Coordinated Universal Time)
పోలింగ్ సరళిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ సరళిపై కీలక వ్యాఖ్యలు చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ సరళిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి రావడం మంచి పరిణామమని అన్నారు. ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. ఒక ఓటు మీ జీవితాలను మారుస్తుందని చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్ కు పునాదులు వేస్తుందని చెప్పారు.
చూస్తూ ఊరుకోబోం...
విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు తరలి రావడం శుభసూచకమని అన్నారు. కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రధానంగా పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో జరిగిన ఘటనలపై తాము ఈసీకి ఫిర్యాదు చేశామన్న చంద్రబాబు రౌడీయిజంతో గెలవాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story