Mon Dec 23 2024 08:40:34 GMT+0000 (Coordinated Universal Time)
"అఖండ" సినిమాపై చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అఖండ సినిమా గురించి ప్రస్తావించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అఖండ సినిమా గురించి ప్రస్తావించారు. ఆయన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులనే అఖండ సినిమాలో చూపించారన్నారు. తాను ఇటీవల అఖండ సినిమాను చూశానని, ఆ సినమా చాలా బాగుదని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అఖండ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని చంద్రబాబు తెలిపారు.
ప్రతి పరిణామాన్ని....
రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని చంద్రబాబు కితాబిచ్చారు. అఖండ సినిమాను చూస్తుంటే ఏపీలో పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలసిపోతుందన్నారు. బాలయ్య యాక్షన్ బాగుందని చంద్రబాబు అన్నారు.
Next Story