Sun Dec 22 2024 23:21:14 GMT+0000 (Coordinated Universal Time)
TDP : రెండో లిస్ట్‌లోనూ సీనియర్లకు మొండి చేయి... వారిని పక్కన పెట్టారా? లేక థర్డ్ లిస్ట్‌లో చోటు ఉంటుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు. సీనియర్ నేతలకు షాక్ ఇచ్చారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు. 34 మందితో కూడిన జాబితాను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మరోసారి కూడా ఈ లిస్ట్‌లో సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి వారికి స్థానం కల్పించలేదు. పెదకూరపాడు టిక్కెట్ ను భాష్యం ప్రవీణ్ కు ఇచ్చారు. కొమ్మాలపాటి శ్రీధర్ ను పక్కన పెట్టేశారు.
కొందరికి మాత్రం....
అయితే గురజాల మాత్రం తిరిగి యరపతినేని శ్రీనివాసరావుకు, దెందులూరు టిక్కెట్ చింతమనేని ప్రభాకర్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. మూడో లిస్ట్‌లో వీళ్ల పేర్లు ఉంటాయా? లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. తొలి విడత 94 స్థానాల్లోనూ, మలి విడత 34 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఇంకా పదహారు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. వివాదాస్పదమైన సీట్ల విషయంలో ఆయన మరోసారి నేతలతో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నర్సన్నపేట - బగ్గు రమణమూర్తి
మాడుగుల - పైలా ప్రసాద్
గాజువాక - పల్లా శ్రీనివాస్
చోడవరం - కే ఎస్ఎన్ఎస్ రాజు
ప్రత్తిపాడు వరపుల - సత్యప్రభ
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
పెదకూరపాడు - భాష్య ప్రవీణ్ కుమార్
గిద్దలూరు - అశోక్ రెడ్డి
రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్
కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వర్ రావు
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
గుంటూరు పశ్చిమ - పిడుగురాళ్ల మాధవి
గుంటూరు తూర్పు - మహ్మద్ నజీర్
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రామనారాయణ రెడ్డి
కొవూరు (నెల్లూరు) - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మి ప్రియ
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు(ఎస్సీ) - గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
కదిరి - కందికుంట యశోదా దేవి
మదనపల్లి - షాజహాన్ బాషా
పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి
చంద్రగిరి - పులివర్తి వెంకటమణి ప్రసాద్
శ్రీకాళహస్తి - కోనేటి ఆదిమూలం
పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్
Next Story