Mon Dec 15 2025 08:00:50 GMT+0000 (Coordinated Universal Time)
TDP Update:నేడు అమరావతికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. రా కదలిరా సభను కూడా వాయిదా వేసుకుని మరీ ఆయన జాబితాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
టీడీఎల్పీ సమావేశంలో...
అయితే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమరావతికి రానున్నారు. ప్రజా సమప్యలపై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు చేయాల్సిన పోరాటంపై చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొందరు నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.
Next Story

