Mon Dec 23 2024 17:00:38 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు టీడీపీ వర్క్ షాప్.. వారందరికీ చంద్రబాబు క్లాస్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు వర్క్షాప్ ను నిర్వహించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు వర్క్షాప్ ను నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన చంద్రబాబు ఐదు అసెంబ్లీ స్థానాలకు, నాలుగు పార్లమెంటు స్థానాలకు మినహా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. వారితో నేడు వర్క్ షాపు పెట్టేందుకు టీడీపీ అధినేత సిద్ధమయ్యారు. టీడీపీ 139 మంది శాసనసభ అభ్యర్థులను, 13 మంది లోక్సభ అభ్యర్థులు ఈ వర్క్ షాప్ నకు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
అవతలి వారి ఎత్తుగడలను...
ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను ఏరకంగా ఎదుర్కొనాలో వివరించనున్నారు. ప్రచారం నుంచి పోలింగ్ వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చంద్రబాబు అభ్యర్థులకు తెలపనున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అందరు అభ్యర్థులను ఈ రెండు నెలల పాటు విశ్రాంతి లేకుండా ప్రచారంలోనే ఉండాలని ఆదేశించనున్నారు. ప్రతి గ్రామాన్ని చుట్టివచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించనున్నారు. పార్టీ ప్రచార సామగ్రి వచ్చేంత వరకూ సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పనున్నారు.
Next Story