Mon Dec 23 2024 03:42:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు వారణాసికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు వారణాసి బయలుదేరి వెళ్లనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు వారణాసి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వారణాసికి వెళతారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్డీఏ సమావేశంలో...
అనంతరం ఎన్డీఏ సమావేశం వారణాసిలోనే జరుగుతుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ఈసారి ఎన్డీఏ మిత్ర పక్షాలతో ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. సాయంత్రం తిరిగి అమరావతికి తిరిగిరానున్నారు.
Next Story