Mon Dec 23 2024 09:26:25 GMT+0000 (Coordinated Universal Time)
ముర్ముతో చంద్రబాబు భేటి
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్తి ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్తి ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రం గేట్ వే హోటల్ ఆమెతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలను, పార్లమెంటు సభ్యులను ఆహ్వానించారు. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపాలని నిన్న తెలుగుదేశం పార్టీ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తొలుత వైసీపీ...
ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ద్రౌపది ముర్ముతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఆమె తొలుత వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఇంటికి తేనేటి విందుకు హాజరు కానున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించాలని ద్రౌపది ముర్ముకు ముందస్తు అభినందనలను తెలపనున్నారు.
Next Story