Fri Dec 20 2024 17:58:31 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు టీడీపీ మూడో జాబితా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మూడో విడత జాబితాను విడుదల చేయనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మూడో విడత జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ రెండు జాబితాలను చంద్రబాబు విడుదల చేశారు. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. ఈ మేరకు వివిధ సర్వేలను అనుసరించి చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసర్తు చేశారు.
బుజ్జగింపుల
రెండు జాబితాలు విడుదలయిన తర్వాత కొంత అసంతృప్తులు బయటపడినా అందరినీ పిలిచి చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ బుజ్జగిస్తున్నారు. అనేక మంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. అయినా పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. టీడీపీ గెలుపునకు సహకరిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. బాబు ఇచ్చిన భరోసాతో నేతలు ఇంటి దారి పడుతున్నారు. ఈరోజు విడుదల చేసే మూడో జాబితాలో ఎక్కువగా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలిసింది.
Next Story