Tue Oct 22 2024 00:31:43 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు చంద్రబాబు హైదరాబాద్ రాక
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశాల నుంచి తిరిగి రానున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశాల నుంచి తిరిగి రానున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అమెరికాకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టులో...
ఈరోజు ఆయన తిరిగి వస్తుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటుండటంతో టీడీపీ నేతలు ఆయనను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు. రేపు ఆయన అమరావతికి వచ్చే అవకాశముందని తెలిసింది.
Next Story