Thu Dec 19 2024 10:17:25 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు తన పెన్ను పవర్ తో ...ఆ చట్టం రద్దు.. రెడీ అవుతున్న ఫైలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేయనున్నారు. తర్వాత సంతకం మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఈ మేరకు అధికారులు ఈ ఫైలును ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రేపే ఆయన ఆ ఫైలుపై సంతకం పెట్టడానికి రెడీ అవుతున్నారు.
రెండో సంతకం...
ఈ ఎన్నికల్లో కూటమి పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడిందని చంద్రబాబు భావిస్తున్నారు. రైతులు కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ యాక్ట్ కు వ్యతిరేకంగా తమను నమ్మి ఓటేశారని భావిస్తున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు, సీట్లు వచ్చాయని కూడా చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఆయన సంతకం పెట్టనున్నారని తెలిసింది.
మంత్రివర్గ సమావేశంలో...
భూహక్కు చట్టం రద్దు చేస్తూ తీసుకునే నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకున్న చంద్రబాబు ఆ ఫైలును రెడీ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ చట్టం రద్దు చేస్తూ సంతకం పెట్టడమే కాకుండా, వెనువెంటనే మంత్రి వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ ఆమోదం తెలిపేలా చంద్రబాబు నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీంతో పాటు ఇకపై ల్యాండ్ కు సంబంధించిన పట్టాలు, పాస్ బుక్ లపై కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండేలా కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story