Mon Dec 23 2024 03:45:18 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అదే రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంటే.. అందుకు కారణమిదే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ఈ తేదీని నిర్ణయించినట్లు తెలిసింది. మంగళవారం ఫలితాలు తమకు అనూహ్యంగా కలసి రావడంతో అదే మంగళవారం ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయించారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
మోదీ ప్రమాణ స్వీకారానికి...
వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత భావించారు. అయితే ఆరోజు ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అందుకే తన ప్రమాణస్వీకారాన్ని మరో మూడు రోజులు వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరయ్యే అవకాశముంది.
Next Story