Tue Mar 18 2025 01:52:16 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఉత్తరాంధ్రకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రజలను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు, బహిరంగసభల్లో పాల్గొంటారు. ప్రజాగళం పేరిట ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రచారానని మరింత ఉధృతం చేశారు.
రాత్రికి బస...
ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఆయన తరచూ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సీతంపేటలో జరిగే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. టీడీపీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రికి ఎన్టీఆర్ భవన్ లోనే చంద్రబాబు బస చేయనున్నారు.
Next Story