Mon Dec 23 2024 23:05:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా చంద్రబాబు పరిశీలిస్తారు. బాధిత రైతులను ఓదార్చనున్నారు. ఎల్లుండి పత్తిపాడు, పర్చూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో...
దాదాపు మూడు నెలల తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి యాభై రెండు రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్ పొంది హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నాయి. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఆయన పర్యటించనున్నారు. అక్కడ చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story