Mon Dec 15 2025 03:53:08 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మళ్లీ చంద్రబాబు పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత రేపు, ఎల్లుండి మరోసారి పర్యటించనున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత రేపు, ఎల్లుండి మరోసారి పర్యటించనున్నారు. ఈసారి విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ వారు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోనున్నారు. విలీన మండలాల్లోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
విలీన మండలాల ప్రజలను...
విలీన మండలాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన రేపు, ఎల్లుండి కొనసాగుతుంది. రేపు రాత్రికి చంద్రబాబు భద్రాచలంలోనే బస చేయనున్నారు. విలీన మండలాల ప్రజలను కలసి వారికి భరోసా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

