Sun Apr 06 2025 22:29:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటకు రానున్నారు. రెండు చోట్ల రా కదలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో పాల్గొని అనంతరం మండపేటకు చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లిపోనున్నారు.
మండపేటలో...
బీఆర్ అంబేద్కర్ కోనసీమ పర్యటనలో శెట్టి బలిజ సంఘం నేత వాసంసెట్టి సుభాష్ నేడు పార్టీలో చేరనున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. దీంతో పోలీసులు అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆంక్షలు విధించారు. సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. బాణా సంచా కాల్చడంపై నిషేధం విధించారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story