Sat Mar 29 2025 06:44:58 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్నారు. ఈరోజు విజయవాడ నుంచి బయలుదేరి విశాఖకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలోని, రాజాం, బొబ్బిలి, విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
విజయనగరం జిల్లాలో...
మూడు రోజుల పాటు చంద్రబాబు విజయనగరం జిల్లాలోనే పర్యటిస్తారు. ఈరోజు రాజాం నియోజకవర్గంలోనూ, రేపు బొబ్బిలి నియోజకవర్గంలోనూ, ఎల్లుండి విజయనగరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటూనే పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే వివిధ వర్గాలతో కూడా సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story