Thu Nov 28 2024 16:54:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెయిల్‌పై విచారణ
లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో ఈ విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఇప్పటికే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 10వ తేదీ నుంచి జైలులోనే ఉన్నారు. క్వాష్ పిటీషన్ ను కూడా హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
టీడీపీలో ఉత్కంఠ...
అయితే నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను విచారించనుంది. దీంతో పాటు చంద్రబాబు రిమాండ్‌ను వచ్చే నెల ఐదో తేదీ వరకూ పొడిగించారు. రిమాండ్ గడువు పూర్తి కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా రిమాండ్ ను పొడిగించారు. బెయిల్ పిటీషన్ పై నేడు ఏం తేలనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story