Mon Dec 23 2024 15:57:34 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం జరిగిందని, రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.
ఫైబర్ నెట్ కేసులో...
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన చంద్రబాబు ఫైబర్ నెట్ట కేసులో ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. నేడు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు వేసిన పిటీషన్ పై విచారణ చేయనుంది.
Next Story