Sat Mar 15 2025 18:40:11 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు జిల్లాలో నేడు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన మూడో రోజు కొనసాగుతుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. మరికాసేపట్లో ఆయన బీసీ సామాజికవర్గం నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ బాధిత దళిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దగదర్తి మండలం దామవరం వద్ద తాను ముఖ్యమంత్రిగా ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలిస్తారు.
రాత్రికి కోవూరులో...
అనంతరం 4.30 గంటలకు కొడవలూరు మండల ఉత్తరరాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై కోవరు నియోజకవర్గ నేతలతో కలసి కోవూరులో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం కోవూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీబొమ్మ కూడలిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరరం రాత్రికి ఉత్తర రాజుపాలెంలోని పీఎస్సార్ కల్యాణమండపంలో బస చేస్తారు. రేపు ఉదయం నెల్లూరు జిల్లా నుంచి బయలుదేరతారు.
Next Story