Mon Dec 23 2024 05:27:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్నూలుకు నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కర్నూలులో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. ఇటీవల స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన సమయంలో అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోటుతో మరణించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
మంత్రాలయానికి చేరుకుని...
కర్నూలు జిల్లా మంత్రాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ మూడు కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారి కుటుంబాలకు అండగా పార్టీతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నారు. రాత్రికి ఆదోని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రికి మందగిరి గ్రామంలో బస చేయనున్నారు. తొలుత పెద్దకడబూరు గ్రామంలో గోపాల్ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు.
Next Story