Thu Dec 19 2024 15:39:49 GMT+0000 (Coordinated Universal Time)
గుడివాడలోనే చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుడివాడలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుడివాడలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నిన్న గుడివాడ వచ్చారు. రాత్రి గుడివాడలోనే బస చేసిన చంద్రబాబు ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ ను కట్ చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేద్కర్‌కు నివాళి...
మరోవైపు నేడు చంద్రబాబు దళితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ప్రత్యేకంగా దళితులతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీ దళితులకు ఏం చేసిందీ చంద్రబాబు ఈ సమావేశంలో వివరించనున్నారు. రానున్న కాలంలో తాము ఏం చేయబోయేది కూడా ఆయన చెప్పనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించడంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు.
Next Story