Mon Dec 23 2024 02:56:43 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్ : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను వాయిదా వేసింది. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం నవంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.
వచ్చే నెల ఏడోతేదీకి...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ మంత్రి నారాయణ కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకూ ఈ కేసులో బెయిల్ కోసం ఆగాల్సిందే.
.
Next Story