Wed Jan 08 2025 23:59:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మిచౌంగ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు. మిచౌంగ్ తుఫాను కారణంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు.
రెండు రోజుల పాటు...
దీంతో ఆయన ఈరోజు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకునే తీరును కూడా ఎండగట్టనున్నారు. ఈరోజు తొలుత గుంటూరు జిల్లాలోని నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్రపాలెం మండలం పాత సందాయ పాలెంలో ఆయన పర్యటిస్తారు. అనంతరం రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతులతో మాట్లాడి వారికి తానున్నానన్న భరోసాను చంద్రబాబు ఇవ్వనున్నారు. చాలా రోజుల తర్వాత జిల్లాల పర్యటనకు చంద్రబాబు వస్తుండటంతో టీడీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story